సత్యసాయి: ఓడీ చెరువు మండలం కొండకమర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివి వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన 1980- 81 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థులు సోమవారం ఒకే వేదికపై కలిశారు. 45 ఏళ్ల తర్వాత అందరూ ఓ చోట కలిసి ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ నేపథ్యంలో పాత జ్ఞాపకాలను, మధుర స్మృతులు నెమరవేసుకున్నారు. అనంతరం యోగ క్షేమాలను తెలుసుకున్నారు.