CTR: పెనుమూరు మండలం మాజీ ఎంపీపీ, మర్టంపల్లి గ్రామానికి చెందిన వీరప్పల్లి హరిబాబు నాయుడు కుటుంబీకులను పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి దంపతులు శుక్రవారం పరామర్శించారు. హరిబాబు నాయుడు సతీమణి గీతా ఈ నెల 17న అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందింది. దీంతో ఆమె మృతి పట్ల ఎమ్మెల్యే తన సతీమణి రేణుకా రెడ్డితో కలిసి తమ సంతాపాన్ని తెలియజేశారు.