W.G: శెట్టిబలిజ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బర్మా కేసరి దొమ్మేటి వెంకటరెడ్డి 172వ జయంతి వేడుకలు ఆదివారం అత్తిలి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొని దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, శెట్టిబలిజ సంఘం సభ్యులు పాల్గొన్నారు.