NTR: మెట్టగూడలో బుధవారం రెడ్డిగూడెం అంకమ్మ తల్లి దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుల నిమజ్జనోత్సవం అట్టహాసంగా జరిగింది. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై గణనాథుడిని ఉంచి, మంగళ వాయిద్యాలు, మేళ తాళాల నడుమ, యువకుల ఆనందోత్సాహాల మధ్య పూలతో స్వాగతం పలుకుతూ.. నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా అంకమ్మ తల్లి దేవస్థానం వద్ద గణనాథుని 17కేజీల లడ్డును వేలం వేశారు.