VZM: పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం సాధ్యపడుతుందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. శనివారం స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గంట్యాడ మండలంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో మంత్రి మొక్కలు నాటారు. అదేవిధంగా పలు నినాదాలు చేస్తూ గ్రామంలో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.