ELR: గోదావరి నదిపై రుద్రంకోట – కూనవరం మధ్య ప్రయాణికులను చేరవేసే ఫెర్రీ నిర్వహణ హక్కులకు శుక్రవారం భారీ ధర పలికింది. కూనవరం పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన బహిరంగ వేలంలో తెల్లపల్లికి చెందిన రాజమ్మ రూ. 89.30 లక్షలకు పాట పాడి హక్కులను దక్కించుకున్నారు. గతేడాది కంటే ఈసారి ప్రభుత్వానికి రూ. 10.70 లక్షల అదనపు ఆదాయం లభించింది.