VZM: వైసీపీ కార్యకర్తలకు శ్రీరామ రక్ష డిజిటల్ బుక్ అని, కూటమి ప్రభుత్వంలో అన్యాయానికి గురవుతున్న కార్యకర్తలకు అండగా నిలవడానికే ‘డిజిటల్ బుక్ ఓపెన్ చేశామని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. ఈ సందర్బంగా సోమవారం వారి నివాసంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో డిజిటల్ బుక్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.