కోనసీమ: కాపు, బలిజ కులాల వారు 50% సబ్సిడీపై రుణాలు పొందేందుకు ఈ నెల 23 లోగా దరఖాస్తు చేసుకోవాలని మామిడికుదురు ఎంపీడీవో వెంకటేశ్వరరావు తెలిపారు. స్వయం ఉపాధి పథకం ద్వారా రూ.2 లక్షలు నుంచి రూ.5 లక్షల వరకు రుణం అవకాశం ఉంటుందని అన్నారు. కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ లతో మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.