నెల్లూరు బారాషహీద్ ఈద్గాలో ముస్లింలతో కలిసి మంత్రి నారాయణ ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా రూ.9.8 కోట్లతో దర్గా అభివృద్ధి పనులను పునఃప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. మైనారిటీల కోసం రూ.20 కోట్లతో ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మిస్తామని, షాదీ మంజిల్ కోసం తన సొంత నిధులు రూ.50 లక్షలు ఇస్తున్నట్లు వెల్లడించారు.