AKP: పాయకరావుపేట మండలం వెంకటనగరం గ్రామానికి చెందిన ఉపాధి హామీ కార్మికుడు పి సూరిబాబు (38) సోమవారం ఉపాధి పనులు చేస్తుండగా పాముకాటుకు గురయ్యాడు. తీవ్ర అస్వస్థతకు గురైన సూరిబాబుని శ్రీరాంపురం పీహెచ్సీలో ప్రాథమిక చికిత్స చేసి తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సూరిబాబును ఎంపీడీవో లవరాజు పరామర్శించారు.