BPT: చీరాల వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జూదం జరుగుతున్నట్లు అందిన పక్కా సమాచారంతో ఎస్సై సిబ్బందితో కలిసి బుధవారం దాడి నిర్వహించారు. ఈ దాడిలో ఆరుగురు జూదరులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.5,180 నగదు స్వాధీనం చేసుకున్నారు. పేకాట, కోడి పందాలు వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.