VSP: విశాఖ-లింగంపల్లి (12805/06) జన్మ భూమి సూపర్ ఫాస్ట్ రైలుకు అనపర్తి రైల్వేస్టేషన్లో ప్రయాణికుల డిమాండ్ మేరకు తాత్కాలిక హాల్ట్ కల్పించనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె. పవన్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ హాల్ట్ జనవరి 6 నుంచి ఫిబ్రవరి 14 వరకు అమలులోకి రానున్నట్లు తెలిపారు. రైల్వే ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.