SKLM: ఎచ్చెర్ల మండల కేంద్రం నుండి ఎస్.ఎం.పురం, ధర్మపురం, పిల్లవలస, తదితర గ్రామాలకు వెళ్లే రోడ్డు మార్గం గుంతలతో అధ్వానంగా తయారైంది. ఈ మార్గంలో ప్రయాణం ప్రమాదకరంగా ఉండటంతో గురువారం ఆటో డ్రైవర్లు స్వచ్ఛందంగా తమ సొంత నిధులతో మరమ్మతుల పనులు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శాశ్వత మరమ్మత్తు పనులు చేపట్టాలని అధికారులను వారు కోరుతున్నారు.