KRNL: హాలహర్వి పోలీస్ కేసుల్లో స్వాధీనం చేసుకున్న 47 వాహనాలను బహిరంగ వేలం గురువారం నిర్వహించారు. ఈ వేలంలో 2 కార్లు, 1 ఆటో, 42 ద్విచక్ర వాహనాలను వేలం వేయగా, మొత్తం రూ. 5.25 లక్షలు GSTతో సహా ఆదాయం ఎస్ఐ ఈశ్వరరావు తెలిపారు. వేలంలో 2 కార్లు అమ్ముడుపోలేదు. ఈ వేలంపాటలో ఎక్సైజ్ సూపర్డెంట్ కర్నూల్ రామకృష్ణారెడ్డి, అయ్యస్వామి, నాయక్, అశోక్ పాల్గొన్నారు.