కృష్ణా: పేదల వైద్యానికి భరోసాగా సీఎం రిలీఫ్ ఫండ్ నిలుస్తోందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మంగళవారం ఉదయం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో 21 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు అయిన రూ.34,59,941 చెక్కులను ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందచేశారు. కూటమి ప్రభుత్వంలో ఇప్పటివరకు సీఎంఆర్ఎఫ్ ద్వారా 779 మందికి రూ.6,23,54,193లు అందించినట్లు తెలిపారు.