NLR: 15వ ఆర్థిక సంఘం నిధులలో ఆంధ్రప్రదేశ్‌లోని స్థానిక సంస్థలకు మొదటి విడత అందించిన నిధులు ఎన్ని అని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లోక్ సభలో ప్రశ్నించారు. నిధులు విడుదలైన విషయం వాస్తవం అయితే ఆంధ్రప్రదేశ్‌కు విడుదల చేసిన టైడ్, అన్ టైడ్ గ్రాంట్ల వివరాలు తెలియజేయాలని కోరారు. ఎంపీ వేమిరెడ్డి ప్రశ్నలకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి సమాధానమిచ్చారు.