ప్రకాశం: ముండ్లమూరు మండలం మారెళ్లలో ఇవాళ ఉదయం బర్రె లెట్రిన్ గుంతలో పడిపోయింది. ఉదయం పూట ఆ ప్రాంతంలో వెళ్తున్న గ్రామస్థులు గుంతలో బర్రె కష్టపడుతూ.. కనిపించడంతో వెంటనే అప్రమత్తమయ్యారు. స్థానికులు JCB, తాడులు ఉపయోగించి కలిసి శ్రమించి బర్రెను సురక్షితంగా బయటకు తీశారు. ఈ క్రమంలో స్థానికులు ముందుకు వచ్చి సహాయం చేయడంతో ప్రాణ నష్టం జరగలేదు.