ATP: అనంతపురంలో ఈ నెల 10న జరగనున్న ‘సూపర్ సిక్స్, సూపర్ హిట్’ సభలో పాల్గొనేందుకు కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ నాదేండ్ల బ్రహ్మం చౌదరి విచ్చేశారు. ఈ తరుణంలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎమ్మెల్యే బ్రహ్మం చౌదరిని శాలువాతో సన్మానించారు. సభ ఏర్పాట్లపై ఇరువురూ చర్చించారు.