కృష్ణా: అవనిగడ్డ పీఏసీఎస్ వద్ద శనివారం రైతులకు యూరియా పంపిణీ చేశారు. సొసైటీ చైర్మన్ మాదివాడ రత్నారావు ఆధ్వర్యంలో రైతులకు యూరియా అందచేశారు. దివి మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, ఏడీఏ జయప్రద, ఏఎంసీ వైస్ ఛైర్మన్ రాజనాల వీరబాబు, సొసైటీ సభ్యులు కమ్మిలి మారిబాబు, భోగాది చంద్రశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.