ప్రకాశం : ఒంగోలులోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో హాకీ ఇండియా శతాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు హాకీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎ.వి.రమణారెడ్డి, ఎ.సుందరరామిరెడ్డి, జిల్లా హాకీ సంఘం జాయింట్ కార్యదర్శి తిరుమలశెట్టి రవికుమార్ లు ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా హాకీ అసో సియేషన్ ఆధ్వర్యంలో పోటీలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.