GNTR: పెదకాకాని మండలంలో రైతన్న మీకోసం కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. టీడీపీ మండల అధ్యక్షుడు వలివేటి మురళి ఆధ్వర్యంలో కూటమి పార్టీ నాయకులు, రైతు భరోసా సిబ్బంది కలిసి ప్రతి రైతు ఇంటి వద్దకే వెళ్లి పంచ సూత్రాల కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న రైతు సంక్షేమ చర్యలు, పథకాల ప్రయోజనాలను రైతులకు ఇంటింటికీ తిరిగి వివరించారు.