GNTR: రెండు నెలలుగా కృష్ణానది వరద కారణంగా గంగపుత్రులకు వేటకి వెళ్లే అవకాశం లేకపోవడంతో జీవనోపాధి లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. వారి పరిస్థితి తెలుసుకున్న మంత్రి లోకేశ్ వారికి ఆసరాగా ఉండాలని నిర్ణయించుకున్నారు. గురువారం ఉండవల్లి మత్స్యకారుల సోసైటీ కార్యాలయం వద్ద సుమారు 300మంది మత్స్యకారులకు స్థానిక టీడీపీ నేతల ద్వారా నిత్యావసరాలు పంపిణీ చేయించారు.