ATP: తాడిపత్రి మండలం ఎరుగుంటపల్లి గ్రామానికి చెందిన సింహం నారాయణరెడ్డి భార్య టంగుటూరి నాగమ్మ స్వచ్ఛాంద్ర మిషన్ డైరెక్టర్గా నియమితులయ్యారు. శుక్రవారం ఆమె ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. పలువురు నాగమ్మకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా పనిచేస్తానని చెప్పారు.