ప్రకాశం: అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు. టంగుటూరులో లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. లారీ యజమానులు న్యాయబద్ధంగా రవాణా నిర్వహిస్తూ వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.