BPT: సూర్యలంకలో ఇవాళ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. కారు, ద్విచక్ర వాహనం ఢీకొనటంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.