KDP: కురబలకోట మండలంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్. శ్రీరాములు (55) అనే రైతు తీవ్రంగా గాయపడ్డారు. పురుగుమందులు కొనుగోలు చేసి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా, మంకువారిపల్లె వద్ద వేగంగా వచ్చిన కారు ఆయన బైక్‌ను ఢీకొట్టింది. స్థానికులు గమనించి, ముదివేడు టోల్‌ప్లాజా అంబులెన్స్ ద్వారా ఆయనను మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు.