అనంతపురంలో ‘అనిమల్ బర్త్ కంట్రోల్’ (ఏబీసీ) కేంద్రాన్ని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తిరిగి ప్రారంభించడంపై నగర మేయర్ మహమ్మద్ వసీం సలీం మండిపడ్డారు. గతంలో తాము ప్రారంభించిన దానినే MLA మళ్లీ ప్రారంభిస్తూ ‘వింత వ్యవహారానికి’ తెరలేపారని విమర్శించారు. గతంలో ఈ కేంద్రం ఏర్పాటును ప్రశ్నించిన వారు ఇప్పుడెక్కడికి వెళ్లారని మేయర్ ప్రశ్నించారు.