AKP: నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో గొలుగొండ మండలం జోగంపేట కూడలిలో గుడ్డు వంటకాల విక్రయ కేంద్రాన్ని టీడీపీ జిల్లా పార్లమెంట్ ఉపాధ్యక్షుడు అడిగర్ల అప్పలనాయుడు ప్రారంభించారు. ప్రజలు ప్రతిరోజూ గుడ్డు తినేలా ప్రోత్సహించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు డీపీఎం జీవనోపాధి అధికారి సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.