CTR: జిల్లాలో ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు. రాబోయే 3 గంటల్లో కొన్ని చోట్ల మెరుపులు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపినట్లు కలెక్టరేట్ అధికారులు చెప్పారు. గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు. మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని తెలిపారు.