MBNR: యూరియా కోసం రైతుల కష్టాలు వర్ణనాతీతం. గత నెల రోజులుగా జిల్లా వ్యాప్తంగా యూరియా కృత్రిమ కొరతతో రైతులు గోస పడుతున్నారు. ఆదివారం హన్వాడ మండల కేంద్రంలోని రైతు సేవ కేంద్రం దగ్గర రైతులు యూరియా కోసం తెల్లవారుజామున 4 గంటల నుంచే క్యూ లైన్లో బారులు తీరారు. యూరియా ఎప్పుడు సరఫరా చేస్తారో స్పష్టత లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.