KMR: నిజాంకాలం నాటి శతవసంతాలు పూర్తిచేసుకుని, చెక్కుచెదరని డంగుసున్నంతో నిర్మించిన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి-నాగిరెడ్డిపేట మండలాల రైతుల వరప్రదాయనైన పోచారం ప్రాజెక్టు అందాలను పర్యాటకులు ఆస్వాదిస్తున్నారు. ప్రాజెక్టు జలాశయం కట్టపై నుంచి తెల్లని పాలపొంగులు పడుతున్నా జలపాతం దృశ్యం పర్యాటకుల మదిని దోచుకుంటుంది.