WGL: రాయపర్తి మండలం సూర్యతండాలో వరంగల్ నుంచి అన్నారం వెళ్లే బస్సు సర్వీసును సోమవారం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రారంభించారు. లాభాపేక్ష లేకుండా ప్రయాణికుల సౌకర్యార్థం మారుమూల ప్రాంతాలకు సైతం ఆర్టీసీ సంస్థ బస్సు సర్వీసులను నడుపుతోందని తెలిపారు. ప్రజలు ప్రైవేటు వాహనాలు ఆశ్రయించకుండా సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేఆర్టీసీ సర్వీసులను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే అన్నారు.