KDP: కలియుగ దైవం తిరుమల, తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఇవాళ ఉదయం కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి, కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం టీటీడీ అధికారులు ఎమ్మెల్యేకు స్వామివారి లడ్డూను అందజేసి,శాలువాతో సన్మానించారు. ఎమ్మెల్యే వెంటా పలువురు కడప జిల్లా TDP నాయకులు పాల్గొన్నారు.