VZM: అనకాపల్లిలో దీపు అనే హిజ్రాను ఆమెతో సహవాసం చేసే దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి ఇటీవల దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. దీపు ఆత్మకు శాంతి కలగాలని నగరంలోని హెల్పింగ్ హాండ్స్ హిజ్రా అసోషియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొండబాబు, అధ్యక్ష కార్యదర్శులు దవడ మీనాకుమారి, స్రవంతి ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. కలెక్టరేట్‌కు వెళ్లి వినతి పత్రం సమర్పించారు.