సత్యసాయి: కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఆదివారం గాలివీటి కృష్ణ మోహన్ నాయుడు తండ్రి గాలివీటి శ్రీరాములు నాయుడు వైకుంఠ సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రీరాములు నాయుడు చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించి, నివాళులర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.