PLD: ఎడ్లపాడులోని శ్రీ గంగా పార్వతీ సమేత రాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో 8వ వార్షికోత్సవం 6వ తేదీన వైభవంగా జరగనుంది. వేకువజాము నుంచి ప్రారంభమయ్యే వేడుకల్లో స్వామికి అభిషేకాలు, ప్రత్యేక అలంకరణ, పూజలు, వివిధ రకాల ప్రసాదాలు ఉంటాయి. సాయంత్రం చెంగీజ్స్కాన్పేట భజన బృందం కోలాట ప్రదర్శన ఉంటుందని ఆలయ కమిటీ తెలిపింది.