కృష్ణా: కంకిపాడు మండలం పునాదిపాడులో తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన వరి పంటలను కలెక్టర్ డీ.కే. బాలాజీ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. చేతికొచ్చే దశలో పంట దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని షరతులు లేకుండా కొనుగోలు చేయాలని వారు కోరగా, రైతులకు న్యాయం చేస్తామని, ఆర్థిక సహాయం అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.