VZM: రాజాంలోని పెనుబాక RSKకి సోమవారం 225 బస్తాల యూరియా రావటంతో భారీ సంఖ్యలో రైతులు చేరుకోవడంతో యూరియా పంపిణీ అధికారులకు సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో స్దానిక పోలీసులకు సమాచారం అందించటంతో వారు గ్రామానికి చేరుకుని రైతులతో మాట్లాడి టోకెన్ల ప్రకారం వరుస క్రమంలో 1-బి, ఆధార్ కార్డు ప్రకారం ఒక్కొక్కరికి ఒక బస్తా చొప్పున యూరియా పంపిణీ చేస్తున్నారు.