NLR: వెంకటాచలంలో చేతన 4.0 ర్యాలీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలకు అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలియజేశారు. కుటుంబాలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోందన్నారు.