ATP: ఐదు నెలల కాలానికి సంబంధించి విద్యా వాలంటీర్ల పోస్ట్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు డీఈవో ప్రసాద్ బాబు బుధవారం తెలిపారు. ఈనెల 5 లోపు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలన్నారు. అనంతపురం జిల్లాకు 80, సత్యసాయి జిల్లాకు 68 విద్యా వాలంటరీ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.