KDP: సిద్ధవటం(మం) మాధవరం-1 పంచాయతీలోని వెంకటేశ్వరపురంలో తాగునీటి కొరత తీవ్రంగా ఉండడంతో శుక్రవారం గ్రామ మహిళలు ఆందోళనకు దిగారు. పలుమార్లు అధికారులకు విన్నవించినా సమస్య ఏ మాత్రం పరిష్కారం కాలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలోని ప్రధాన రహదారిపై మహిళలు బిందెలతో నిరసన తెలుపుతూ.. తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.