VSP: ఇంజనీరింగ్, ఫార్మసీ పీజీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ పీజీఈసెట్ దరఖాస్తు గడువును మార్చి 20 వరకు పొడిగించినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ పి. మల్లికార్జునరావు తెలిపారు. విద్యార్థుల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆలస్య రుసుముతో మార్చి 23 నుంచి ఏప్రిల్ 1 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు.