ప్రకాశం: తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఆర్ఐలు రమణారెడ్డి, సీతారామరెడ్డి మరియు సిబ్బంది మొల్లమాంబ చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించారు. ఆమె రచించిన మొల్ల రామాయణం తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానం పొందిందని కొనియాడారు.