సత్యసాయి: కదిరి కొండలోని ప్రహ్లాద సమేత ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో ప్రతీ నెల స్వాతి నక్షత్రం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో గిరిప్రదక్షిణ నిర్వహిస్తారు. ఈనెల 25వ తేదీన జరిగే గిరిప్రదక్షిణకు విచ్చేసే భక్తులకు మలిశెట్టి వేణుగోపాల్ కుటుంబ సభ్యులు, వారి స్నేహితులు అల్పాహారం విందు ఏర్పాటు చేయనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.