PPM: మద్యాన్ని MRP ధరలకే విక్రయించాలని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ డి.పద్మావతి అన్నారు. ఆమె మాట్లాడుతూ.. సీతానగరం మండలంలో ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని బెల్ట్ షాపుల నిర్వాహకులపై ఉక్కు పాదం మోపుతున్నామని తెలిపారు. అలాగే ఇప్పటివరకు 145 మంది నిర్వాహకులపై కేసులు నమోదు చేశామని వారి వద్ద నుంచి 226 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.