ప్రకాశం: ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం గ్లోబల్ హ్యాండ్ వాష్ డే ప్రాధాన్యతను వివరిస్తూ ఏర్పాటుచేసిన గోడ పత్రికను కలెక్టర్ రాజాబాబు ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతను పాటించాలని, భోజనానికి ముందు తప్పనిసరిగా చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. చేతుల పరిశుభ్రతతో ఎన్నో వ్యాధులు దరిచేరవని ఆయన తెలిపారు.