ATP: బెలుగుప్ప మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటనలో గాయపడిన కండక్టర్, మహిళ ప్రయాణికురాలికి మెరుగైన వైద్యం అందించాలని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ డీఎంహెచ్ఓ, ఆర్టీసీ అధికారులకు ఆదేశించారు. బస్సులో 15 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన కారణాలు తెలుసుకోవాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు.