NDL: జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 8న మాస్టర్స్ టెన్నిస్, బాడ్మింటన్ పోటీలు నిర్వహించనున్నట్లు DSO రాజు ఓ ప్రకటనలో తెలిపారు. టెన్నిస్ (40+), బాడ్మింటన్ (35+, 45+) విభాగాల్లో పురుషులు, మహిళలకు సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ప్రతిభకనబరిచిన వారు రాష్ట్ర స్థాయికి ఎంపికవుతారన్నారు.