W.G: ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందుతోందని డీఈవో నారాయణ అన్నారు. అర్జమూరు గరుకుల పాఠశాలను సందర్శించిన ఆయన, విద్యార్థుల చదువును పరిశీలించారు. ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమం ద్వారా పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించాలని కోరారు. ఉచిత విద్యతో పాటు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నామని, వసతుల కల్పనలో రాజీ లేదని ఆయన స్పష్టం చేశారు.