విశాఖలోని తాడి చెట్ల పాలెం హైవేపై శనివారం రాత్రి ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మరణించాడు. రోడ్డు దాటుతుండగా ఆయన వాహనం వెనుక చక్రాల కింద పడిపోయినట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో తల భాగం నుజ్జు నుజ్జు అయిపోయి, అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతి చెందిన వ్యక్తి దేముడుగా పోలీసులు గుర్తించారు.